జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా సుర్కంటి శ్రీధర్ రెడ్డి

జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా సుర్కంటి శ్రీధర్ రెడ్డి

చౌటుప్పల్ (ఆంధ్రప్రభ): యాదాద్రి భువనగిరి జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా చౌటుప్పల్ మండలంలోని మందోళ్లగూడెం గ్రామ ఉప సర్పంచ్ సుర్కంటి శ్రీధర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉప సర్పంచ్‌ల సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు చోట్ల కార్తీక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సుర్కంటి శ్రీధర్ రెడ్డిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సుర్కంటి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న జిల్లాలోని ఉప సర్పంచ్‌లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉప సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు చోట్ల కార్తీక్ మాట్లాడుతూ ఉప సర్పంచ్‌ల సంక్షేమం, ఫోరం బలోపేతానికి శ్రీధర్ రెడ్డి నాయకత్వం ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సుర్కంటి శ్రీధర్ రెడ్డి ఎన్నిక ఉప సర్పంచ్‌ల ఐక్యతకు నిదర్శనమని పలువురు ప్రజాప్రతినిధులు కొనియాడారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనకు ఉప సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply