నూతన అధ్యక్షునిగా పోలోజు శ్రీనివాసాచారి

నూతన అధ్యక్షునిగా పోలోజు శ్రీనివాసాచారి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షునిగా మునుగోడు అభివృద్ధి ప్రదాత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో పోలోజు శ్రీనివాసాచారిని నియమించారు. చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, 10వ వార్డు కౌన్సిలర్ దేప రమ్యరాజు, 10వ వార్డ్ మాజీ కౌన్సిలర్ బొడిగె అరుణ బాలకృష్ణ గౌడ్ ల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.
అధ్యక్షులుగా పోలోజు శ్రీనివాసాచారి, ఉపాధ్యక్షులుగా కానుగు మధు, ప్రధాన కార్యదర్శిగా దేప నరేష్, కోశాధికారిగా కైరంకొండ శ్రీనివాసులు, సహాయ కార్యదర్శిగా ఎండి ఖదీర్, ప్రచార కార్యదర్శిగా ఎండి అజం ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి చౌటుప్పల్ మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ చాంద్ పాషా, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ చింతల మహేందర్, గోశిక నరసింహ, ఎరుకల సాయి, మాజీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని శాలువాలతో సన్మానించారు.
