మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే

మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే

  • మండల పార్టీ అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్

దండేపల్లి, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించాయి. పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకుని 26వ ఏట అడుగుపెడుతున్న శుభసందర్భంగా మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గులాబీ జెండాను ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ తన 26 ఏళ్ల ప్రస్థానంలో 13 ఏళ్లు ఉద్యమ పార్టీగా, ఆపై 10 ఏళ్లు పాలక పార్టీగా ఎన్నో చారిత్రక ఘట్టాలకు, అభివృద్ధి నమూనాలకు వేదికగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ అస్తిత్వాన్ని చాటిన పార్టీగా ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్నామని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు క్షేత్రస్థాయిలో నిలదీస్తామని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని విమర్శించారు. రాబోయే రోజుల్లో మళ్లీ అధికారం బిఆర్ఎస్ పార్టీదేనని, కేసీఆర్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పని చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నాయకత్వంలో ఎవరైనా పార్టీలోకి రావచ్చని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పసర్తి అనిల్ కుమార్, కాసనగొట్టు లింగన్న, అక్కల రవీందర్, గొట్ల భూమన్న, గోళ్ళ రాజమల్లు, బచ్చల అంజన్న, పత్తిపాక శ్రీనివాస్, రేణి శ్రీనివాస్, గొట్ల రవి, ఆశెట్టి వెంకటరమణ, అల్వాల సత్యం మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply