HYD | భారీగా ఎగిసిపడుతున్న మంటలు..

HYD | భారీగా ఎగిసిపడుతున్న మంటలు..

HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌ నగరంలోని అంబర్‌పేటలో ఇవాళ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చే నంబర్‌ కూడలి వద్ద ఉన్న మహీంద్ర షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పలువురు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. షోరూమ్‌లో నిల్వ ఉంచిన వాహనాలు, ఇతర సామగ్రికి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

Leave a Reply