సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ఆర్యవైశ్య సంఘం సభ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. వాసవి మాత జయంతిని రాష్ట్ర అధికారిక పండుగగా ప్రభుత్వం ప్రకటించినందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐవిఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రొద్దుటూరు రమేష్ గుప్తా, దిడిగం అంజయ్య,మిరియాల ఉమామహేశ్వర్, వంగపల్లి నరేందర్, దిడిగం సంతోష్, కస్తూరి అంజయ్య, నంగునూరు కృష్ణమూర్తి, కాశెట్టి శ్రవణ్ కుమార్, దిడిగం వీరయ్య, కస్తూరి వెంకటేష్, నాగబండి శాంత, రాజయ్య, బలరాం, ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.