ధర్మ యోగ బిరుదు పొందిన దాత్రిక రమేష్

నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : నగరానికి చెందిన గోరక్ష ప్రముక్ దాత్రిక రమేష్ కు ధర్మ యోధ బిరుదును పొందారు.భారత్ నేషనలిస్ట్ ఫోరం హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో శ్రీ జగద్గురు అది శంకరాచర్య జయంతి ఉత్సవాలలో భాగంగా భాగ్యనగర్ లోని భైరముల గూడ లోని సువర్ణ భారతి గోశాలలో ఇందూరుకు చెందిన విశ్వహిందూ పరిషత్ గోరక్ష ప్రాంతా కృషి ప్రముఖ్ దాత్రిక రమేష్ ధర్మ యోధ బిరుదుతో సన్మానించారు.

గోమాతకు రక్షించడములో దేనికైనా సిద్ధమై అహర్నిశలు కృషి చేస్తున్న వారికీ ధర్మయోధ బిరుదు సత్కారిస్తు బ్రాహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ , తుమృగోటి యాదగిరి రావు దక్షణ భారత గోరక్ష ప్రముఖ్ విశ్వహిందు పరిషత్, బస్వరాజు కర్నూల్ దేవాలయాల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ప్రముఖ ఆధ్యాత్మిక వక్త ల చేతులమీదుగా ధర్మయోధ బిరుదు ప్రధానోత్సవం జరిగిందని దాత్రిక రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మయోద బిరుదు పొందడం సంతోషంగా ఉందని అన్నారు. గో రక్ష కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.

Leave a Reply