రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి..

రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి..
జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగిత్యాల కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని, ఇది మళ్ళీ తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తు చేసిందని ఆయన అన్నారు. కేసీఆర్ సభ సక్సెస్‌ను జీర్ణించుకోలేకే రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో మార్పు మొదలైందని, ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.
రైతుబంధును మూడుసార్లు ఎగ్గొట్టారని, మహిళలకు ఇస్తానన్న రూ.2500 ఊసే లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. విద్యా వ్యవస్థను నాశనం చేశారని, కనీసం ఒక్క రివ్యూ కూడా చేయలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆంధ్రా నాయకుల చేతిలో కీలుబొమ్మలా మారి, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. నాదెండ్ల భాస్కరరావు అంశంపై రేవంత్ రెడ్డికి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఆనాడు తాను మంత్రి పదవికి స్వయంగా రాజీనామా చేశానని, తనను ఎవరూ తొలగించలేదని స్పష్టం చేశారు.
