ఘనంగా ఫాదర్ రెవ.గడ్డం జోజి పట్టాభిషేక దినోత్సవ వేడుకలు……

ఘనంగా ఫాదర్ రెవ.గడ్డం జోజి పట్టాభిషేక దినోత్సవ వేడుకలు……
పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్‌నగర్ ఆర్‌సీఎం చర్చీ ఫాదర్ రెవ, గడ్డం జోజి 20వ పట్టాభిషేక దినోత్సవ వేడుకలు సింగ్‌నగర్ సెయింట్ ఆన్స్ స్కూల్ ఆవరణలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పరిశుద్ద సిలువ దేవాలయం కమిటీ పెద్దలు, మరియదళ సభ్యులు, యూత్ కమిటీ సభ్యులు, క్యాథలిసం క్లాస్ చిన్నారులు ఫాదర్ జోజిని శాలువాలతో సన్మానించి, పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.గత 20 సంవత్సరాలుగా ఫాదర్ జోజి ఎన్నో వేలమందిని ఆధ్యాత్మికతవైపుకు నడిపించడం సంతోషదాయకమన్నారు.
ఆ యేసుక్రీస్తు ప్రభువు దీవెనలు, మరియతల్లి ఆశీస్సులు ఆయనకు ఎళ్లవేళలా తోడుగా ఉండాలని.. ఫాదర్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ ఆశాజార్జ్, కరస్పాండెంట్ సిస్టర్ జెస్సి థామస్, వైస్ ప్రిన్సిపల్ సుగుణశీల, పరిశుద్ద సిలువ దేవాలయం కమిటీ పెద్దలు జాన్‌పీటర్, అంతోని, బాలరాజు, రవి, బుజ్జా, అమల్నాథన్, ప్రదీప్, కోటేశ్వరరావు, జోజప్ప, చిన్నప్ప, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
