భక్త మార్కండేశ్వర దేవాలయానికి నూతన కమిటీ..

భక్త మార్కండేశ్వర దేవాలయానికి నూతన కమిటీ..

మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామంలోని భక్త మార్కండేశ్వర దేవాలయ నూతన కార్యవర్గాన్ని పలివెల పద్మశాలి కుల బాంధవుల సమక్షంలో ఈరోజు ఎన్నుకున్నారు. దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ కమిటీ పని చేయనుందని తెలిపారు.
అధ్యక్షుడిగా పూల శ్రీనివాస్ తండ్రి నరసింహ, ఉపాధ్యక్షుడిగా చెరుకు సైదులు,కార్యదర్శిగా కోణం మురళి, కోశాధికారిగా బడుగు గోవర్ధన్,డైరెక్టర్లుగా మేకల వీరస్వామి,పున్నరాజు, చెరుపల్లి శ్రావణ్ కుమార్,గుర్రం శ్రీనివాస్, రాపోలు మురళి నియమితులయ్యారు. కమిటీ సభ్యులను పలివెల పద్మశాలి కుల బాంధవులు అభినందించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు కార్యదర్శులు వారి ఎన్నికకు సహకరించిన కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని కుల బాంధవులకు హామీ ఇచ్చారు.

Leave a Reply