హసన్ పర్తి జమా మసీద్ అధ్యక్షులుగా అహ్మద్

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా అసంపూర్తి 66 డివిజన్ కేంద్రంలోని జమా మసీద్ అధ్యక్షులుగా సయ్యద్ అహ్మద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మసీదు నూతన కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షునితోపాటు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా మహమ్మద్ హలీం, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ఖలీల్, కోశాధికారిగా ఎండి ఇస్మాల్, సంయుక్త కార్యదర్శిగా మహ్మద్ వాజీద్, కార్యవర్గ సభ్యులుగా మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ మసూద్, మహ్మద్ జుబేర్, సయ్యద్ రఫీక్,మహ్మద్ ఇమాంషా,మహమ్మద్ పైజల్ లు ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల నిర్వహకులుగా మహ్మద్ రహీం,ఖాజా జాఫర్ షరీఫ్ లు వ్యవహరించారు. ఈకమిటీకి మూడేళ్ళ కాలపరిమితి ఉటుందని ఎన్నికల ఇంచార్జిలు పేర్కొన్నారు.
