బ్యూటీషియన్, టైలరింగ్ శిక్షణతో మహిళలకు స్వయం ఉపాధి

బ్యూటీషియన్, టైలరింగ్ శిక్షణతో మహిళలకు స్వయం ఉపాధి

  • హైకోర్టు న్యాయవాది కృష్ణ ప్రసన్న
  • కొండపల్లిలో యాంబర్ అండ్ డ్యూ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏస్తటిక్స్ అండ్ బోటిక్ అకాడమి ప్రారంభం

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు బ్యూటీషియన్, టైలరింగ్ శిక్షణ దోహదపడుతుందని హైకోర్టు న్యాయవాది వైట్ల కృష్ణ ప్రసన్న అన్నారు. కొండపల్లి కొత్త బీ కాలనీ వద్ద యాంబర్ అండ్ డ్యూ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏస్తటిక్స్ అండ్ బోటిక్ అకాడమిని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యూటీషియన్, టైలరింగ్ లో గ్రామీణ ప్రాంత మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు అకాడమిని ప్రారంభించడం శుభపరిణామమన్నారు. ఈ అకాడమిలో శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధి సాధించే అవకాశం ఉందన్నారు.

బ్యూటీషియన్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. మహిళా సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృషి చేస్తున్నాయని వివరించారు. నిరుద్యోగ యువతులు, మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ట్రైనర్ తార మాట్లాడుతూ యాంబర్ అండ్ డ్యూ ఇన్ స్టిట్యూట్ ద్వారా బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు. రెండు నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి కల్పించి స్కిల్ ను బట్టి వేతనాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ప్రొప్రైటర్ చింతల కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply