ఒకే నంబర్‌తో సేవలు సులభం

ఒకే నంబర్‌తో సేవలు సులభం
మునుగోడు, ఏప్రిల్ 14 (ఆంధ్రప్రభ): రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి సులభంగా పొందాలంటే రైతు భరోసా,ఫార్మర్స్ రిజిస్ట్రీ,ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌లలో ఒకే మొబైల్ నంబర్ నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఎస్.పద్మజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు . వేర్వేరు నంబర్లు ఉంటే ఎరువుల బుకింగ్‌లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశముందన్నారు.
పాత నంబర్ అందుబాటులో లేకపోయినా లేదా వేర్వేరు నంబర్లు ఉన్నా వెంటనే ఏఈఓలను సంప్రదించి ఒకే నంబర్‌గా అప్డేట్ చేయించుకోవాలని రైతులకు సూచించారు. దీంతో ప్రభుత్వ పథకాల లబ్ధి నేరుగా,వేగంగా అందుతుందని పేర్కొన్నారు.
వరి ధాన్యం కొనుగోలు సమయంలో తాలు శాతం అధికంగా ఉంటే మిల్లులు తిరస్కరించే అవకాశం ఉందని, అందువల్ల రైతులు తప్పనిసరిగా తాలు పట్టుకోవాలని సూచించారు.కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు కూడా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
