రోడ్డు భద్రత….అందరి బాధ్యత

రోడ్డు భద్రత….అందరి బాధ్యత

అలైవ్….. అరేయ్ కార్యక్రమంలో
కె. యూ ఎస్సై విజయ్ కుమార్

భీమారం, ఆంధ్ర ప్రభ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భీమారం జంక్షన్ లో పోలీస్ ఉన్నతాధికారుల, సి.ఐ. ఎస్. రవి కుమార్ ఆదేశాల మేరకు కేయూ ఎస్ఐ విజయ్ కుమార్ అరైవ్ – అలైవ్ నినాదంతో న కార్యక్రమం న్ని నిర్మించారు. ముందుగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలన్నారు.

సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దన్నారు.కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని తెలిపారు. మన ప్రాంతంలో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాటి ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని వారి వల్ల వారి కుటుంబ సభ్యులు కూడా రోడ్డున పడుతున్నారని అందుకోసమే వాహనాలు జాగ్రత్తగా నడవాలని సూచించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply