ఘనంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమం..

ఘనంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమం..

  • విద్యార్థులకు వ్యాసరచన పోటీలు,

​చిట్యాల, ఆంధ్రప్రభ : ​రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా, బుధవారం చిట్యాల మోడల్ స్కూల్‌లో చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. హెల్మెట్ ధరించడం – ప్రాణ రక్షణ’ అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.​

ఎస్.ఐ-3 ఈశ్వరయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రోడ్డు భద్రతా నియమాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు, పోలీసులు కలిసి భారీ మానవహారంగా ఏర్పడి, రోడ్డు భద్రతపై నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఏఎస్ఐ మధుసూదన్, హెడ్ కానిస్టేబుల్ చంద్రమౌళి, కానిస్టేబుల్స్ ఏ, సందీప్, పి సందీప్, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply