హుజూర్‌నగర్ లో జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీలు

హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ ; హుజూర్‌నగర్ పట్టణంలో పట్టణ స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్తానిక గడ్డిరెడ్డి ఫంక్షన్ హాల్ లోని స్విమ్మింగ్ పూల్ లో ఆదివారం జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్ లు ప్రయాణించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… హుజూర్‌నగర్ పట్టణంలో 8 నుంచి 60 సంవత్సరాల వ్యక్తులకు జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
స్విమ్మింగ్ (ఈత) చేయడం ద్వారా ఎన్నో శారీరక మానసిక ప్రయోజనాలు ఉన్నాయని ప్రతి మనిషి వారి దైనందిన జీవితంలో ఈత దినచర్య గా అలవాటు చేసుకోవాలని అన్నారు. అనంతరం ఈతల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ డీఈ వెంకటకృష్ణయ్య, కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి, నిర్వాహకులు బాచిమంచి కొండయ్య, మట్టపల్లి సత్యనారాయణ, తాటి జనార్ధన్ రెడ్డి, యర్రమల్ల సైదారావు, గెల్లి రంగారావు, మోహన్ రెడ్డి, దేవరం అప్పిరెడ్డి పోటీదారులు పాల్గొన్నారు.
