ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చాటిన జాడి సాత్విక్

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని మాసాయిపేట గ్రామానికి చెందిన జాడి సాత్విక్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తన సత్తా చాటాడు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొత్తపల్లి ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూపులో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్, ఇటీవల నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యాడు.

ఆదివారం విడుదలైన ఫలితాల్లో అతను 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా సాత్విక్‌ను కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, గ్రామస్తులు మరియు అతని తల్లిదండ్రులు అభినందించారు.

Leave a Reply