పాఠశాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..
జైపూర్, ఆంధ్రప్రభ : జైపూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం అలాగే గంగిపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ త్వరగా పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.శుక్రవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణతో కలిసి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విదంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
వంటశాలలో శుభ్రత, నిబంధనలు పాటించాలని,విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని అన్నారు.అన్ని ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని సూచించారు.అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు,దుప్పట్లు పంపిణీ చేశారు. అదే విధంగా ఇటీవల గంగిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన మూత్రశాల నిర్మాణాలను గుర్తుతెలియని వ్యక్తులు కూల్చి వేసిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వ ఆస్తులు నష్టం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
