17న “చెట్టుకూలుతున్నచప్పుడు” కవిత్వసంపుటి ఆవిష్కరణ

ఉమ్మడి మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ రచయితల వేదిక, సిద్ధిపేట జిల్లాశాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కవి, రచయిత కొండి మల్లారెడ్డి రచించిన “చెట్టుకూలుతున్నచప్పుడు” కవిత్వసంపుటి ఆవిష్కరణ సభ ఈ నెల 17న సాయంత్రం 6 గంటలకు సిద్ధిపేట ప్రెస్ క్లబ్‌లో నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ కవులు కవియాకూబ్, బూర్ల వెంకటేశ్వర్లు, ఉప్పల పద్మ, గఫూర్ శిక్షక్, పర్కపెల్లి యాదగిరి అతిథులుగా హాజరవుతారని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు మహమూద్ పాషా తెలిపారు. ఈ సందర్భంగా కవులు, రచయితలు, సాహిత్యాభిలాషులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఇదే కార్యక్రమానికి సంబంధించి పుస్తక ఆవిష్కరణ సభ కరపత్రాన్ని ఆదివారం సిద్ధిపేట ప్రెస్ క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహమూద్ పాషా, స్రవంతి మహిపాల్, అశోక్ రాజు, పర్కపెల్లి యాదగిరి, అంకూరి ఉమాశంకర్, నర్సింహులు, ఆశిష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply