కస్నా తండాను సీత్యా తండాగా మార్చాలి..

కస్నా తండాను సీత్యా తండాగా మార్చాలి..

తొర్రూరు, ఆంధ్రప్రభ : మండలంలోని కంటాయపాలెం గ్రామ శివారులోని కస్నా తండా పేరును సీత్యా తండాగా మార్చాలని తండావాసులు కోరారు.ఈ మేరకు కస్నా తండా వాసులు సోమవారం డివిజన్ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా తండావాసులు మాట్లాడుతూ….సీత్యా నాయక్ గత వంద సంవత్సరాల క్రితం కంటాయపాలెం శివారులో మొట్టమొదటిగా స్థావరం ఏర్పరచుకొని ఉన్నారని, అప్పుడు ఆయన పేరు మీదుగానే తండా పేరు కొనసాగేదని గుర్తు చేశారు. మధ్యలో కొందరు కావాలని తండా పేరును మార్చారన్నారు.తిరిగి పాత పేరు నే నామకరణం చేయాలన్నారు. సీత్యా నాయక్ తండా ఏర్పాటుకు కృషి చేశారని,ఆయన జ్ఞాపకార్థం తండాకు పేరు మార్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో కంటయపాలెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోకాటి వెంకన్న,తండా వాసులు బానోత్ మురళి,బానోత్ దేవేందర్, సోమన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply