ప్రత్యేక ఓటర్ల సవరణ దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్

కరీమాబాద్ (ఆంధ్రప్రభ): ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని మాజీ కార్పొరేటర్ ఎలగం లీలావతి సత్యనారాయణ తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సూచనల మేరకు గురువారం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి బీఎల్‌వోల ద్వారా ఓటరు గణన దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు.

దరఖాస్తులను స్వీకరించిన అనంతరం వాటిలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుతున్నామని, ప్రతి ఫారాన్ని బీఎల్‌వోలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. పూర్తిగా నింపిన దరఖాస్తులను మరోసారి తనిఖీ చేసిన తర్వాతే స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు పాల్గొని ఓటర్లకు అవసరమైన సమాచారం అందిస్తూ సహకరించారు.