ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ పాలకుర్తి గౌతమ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఆలయ ధర్మకర్త, ప్రముఖ వైద్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో స్వామివారికి జలాధివాసం, పాలాదివాసం, ఫలాధీవాసం, పుష్పాధీవాసం, ధాన్యాదివాసం, శయనాదివాసం నిర్వహించి ప్రత్యేక యజ్ఞం చేపట్టారు. శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.