ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; భారత మాజీ ఉప ప్రధాని,అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను కమ్మర్ పల్లి మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుడు,సామాజిక న్యాయ సాధకుడు అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్,మాజీ ఎంపిటిసి మైలారాం సుధాకర్ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో,ముఖ్యంగా అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి అనన్యసామాన్యమని కొనియాడారు.భారత పార్లమెంటరీ వ్యవస్థలో సుదీర్ఘకాలం పాటు వివిధ శాఖల మంత్రిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని,ఆయన చూపిన బాటలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సాయన్న,మేకల శ్రీకాంత్,గంగాధర్, శ్రీను,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply