18వ వార్డులో యువత బీఆర్‌ఎస్‌కు మద్దతు
18వ వార్డులో యువత బీఆర్‌ఎస్‌కు మద్దతు
- అభ్యర్థి రేగూరి కరుణ విజయపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం పరకాల,
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో బీఆర్‌ఎస్‌కు యువతతో పాటు ప్రజల మద్దతు వెల్లువెత్తుతోంది. గురువారం బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి రేగూరి కరుణ విజయపాల్‌రెడ్డి వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చేశారని, పట్టణంలో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల భవనాలు నిర్మాణం చేశారని అన్నారు.
18వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి రేగురి కరుణ విజయపాల్ రెడ్డి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తుచేస్తూ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కరుణ విజయపాల్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
