భావితరాలకు భరోసా జనసేన..

భావితరాలకు భరోసా జనసేన..

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : భావితరాల భవిష్యత్తుకు భరోసా జనసేనపార్టీ అని జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గాదె పృథ్వీ అన్నారు. పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా శనివారం డివిజన్ కేంద్రంలోని ఛత్రపతి శివాజి చౌక్ వద్ద పార్టీ జండావిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఆయన విలేక రులతో మాట్లాడుతూ అవినీతి రహిత పాలనే జనసేన నినాదమ న్నారు.

అధినేత పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో చేస్తున్న పాలన దేశం గర్వి స్తుందని తెలిపారు. జనసేన నిజాయితీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తున్నారు. ఈ స్ఫూర్తితో నియోజకవర్గంలో జనసేన బలోపేతం చేస్తా మన్నారు. ఏడేళ్లుగా ప్రజల మధ్య ఉంటూ అనేక ప్రజా సమస్యలపై పోరాడినట్లు తెలిపారు.యువతను ఏకం చేస్తూ రాజకీయాల్లో మార్పుకై జనసేన కృషి చేస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయ కులు ఆమంచ సునీల్,మొహమ్మద్ రజాక్, కొలిపాక వంశీ కృష్ణ, రాజోజు రాజశేఖర్, మేడిద ప్రశాంత్ రెడ్డి,జనసైనికులు రాజోజు సాయి చరణ్, అక్కనపెల్లి సాయి,గాదె వినయ్, అంగిడి శ్రీనివాస్, సిద్దు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply