కాటమయ్య పండుగకు ముందస్తు ఏర్పాట్లు…

కాటమయ్య పండుగకు ముందస్తు ఏర్పాట్లు…
- గుడి పరిసరాల్లో చెట్లు, పొదల తొలగింపు
- కుల పెద్దల విజ్ఞప్తికి స్పందించిన కౌన్సిలర్లు
- చైర్మన్ వినయ్ కుమార్, కమిషనర్ ఆదేశాలతో ప్రత్యేక చర్యలు
- లైటింగ్, శానిటేషన్ మెరుగుపరుస్తామని హామీ
- కృతజ్ఞతలు తెలిపిన గౌడ్ సంఘం కులస్తులు
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు గ్రామంలో రాబోయే కాటమయ్య పండుగను పురస్కరించుకొని గౌడ్ కులస్తులు తమ కుల దైవం కాటమయ్య గుడి పరిసరాల్లో శుభ్రత చర్యలు చేపట్టాలని కోరా రు. గుడి ఆవరణలో పెరిగిన చెట్లు, పొదలు అధికంగా పెరగడంతో పాటు పరిసరాలు అశుభ్రంగా మారి పండుగ ఏర్పాట్లకు ఇబ్బంది కలు గుతోందని కుల పెద్దలు ముందుస్తుగా ఈ సమస్యను స్థానిక కౌన్సిలర్లు పొన్న రాజేష్, బాలగాని అనిల్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లారు.
వారు వెంటనే స్పందించి మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, కమి షనర్ రాధాకృష్ణకు వివరించారు. సమస్య ప్రాముఖ్యతను గుర్తించిన వారు శనివారం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మున్సిపల్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి గుడి పరిసరాల్లో పెరిగిన చెట్లు, పొదలను పూర్తిగా తొలగించారు. అలాగే గుడి ప్రాంగణా న్ని శుభ్రపరిచి పండుగ నిర్వహణకు అనుకూల వాతావరణాన్ని తీసుక వచ్చారు.
- కృతజ్ఞతలు తెలిపిన గౌడ్ కుల పెద్దలు:
ఈ సందర్భంగా వెంటనే సమస్య పరిష్కారం చూపినందుకు మున్సి పల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, కమిషనర్ రాధాకృష్ణ, కౌన్సిల ర్లు పొన్న రాజేష్, బాలగాని అనిల్ గౌడ్‌లకు గౌడ్ కుల పెద్దలు కృతజ్ఞత లు తెలిపారు. అనంతరం కాటమయ్య పండుగకు ముందు గుడి పరిస రాల్లో సమగ్రంగా లైటింగ్ సదుపాయాలు, మరింత మెరుగైన శానిటేషన్ ఏర్పాట్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పండుగను ఎలాంటి ఇబ్బందు లు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు మున్సిపాలిటీ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం అధ్యక్షుడు రంగు ప్రభాకర్, ఉపాధ్యక్షుడు వడ్లకొండ విజ య్, డైరెక్టర్లు మాచర్ల బిక్షపతి, వడ్లకొండ నర్సయ్య, మాచర్ల అశోక్, ఉత్సవ కమిటీ సభ్యులు మాచర్ల ప్రవీణ్, రంగు యాకయ్య, వడ్లకొండ రమేష్, కోతి అజయ్, రంగు వెంకటేష్, రంగు అనుఫ్ తదితరులు పాల్గొన్నారు.
