1000 above | అరుదైన వృక్ష సంపద, ఆయుర్వేద మూలికల నిలయం

1000 above | మేడారం అడవుల్లోని ప్రధాన వృక్ష సంపద
అరుదైన ఆయుర్వేద మూలికలు – గిరిజన వైద్య సంప్రదాయం
గిరిజన జీవన విధానంలో మూలికా వైద్య ప్రాధాన్యం
పర్యావరణ పరిరక్షణలో మేడారం అడవుల పాత్ర
అడవుల సంరక్షణపై అధికారుల హెచ్చరిక

1000 above | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మేడారం అడవుల్లో ఉన్న వృక్ష సంపద, ఆయుర్వేద మూలికల లభ్యత విశేషాలేమిటి? మేడారం అడవుల్లో అరుదైన మూలికలు.. మేడారం…మహాజాతర సం రంభంతో క్రిక్కిరిసింది. ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. అయితే ఈ అడవులు కేవలం ఆధ్యాత్మికతకే కాదు, అపారమైన వృక్ష సంపద, అరుదైన ఆయుర్వేద మూలికలకు నిలయం. మేడారం అడవులంటేనే అరుదైన వృక్ష సంపద, ఆయుర్వేద మూలికల భాండాగారం.

1000 above
1000 above

సమ్మక్క–సారలమ్మ జాతర జరిగే మేడారం ప్రాంతం, తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ విస్తీర్ణంలో ఉంది. ఇది దండకారణ్య అరణ్య వ్యవస్థలో ముఖ్య భాగం, ఇక్కడ కనిపించే జీవ వైవిధ్యం భారత దేశంలోనే ప్రత్యేకమైనది. మేడారం అడవుల్లోని ప్రధాన వృక్ష సంపదలో ముఖ్యమైనవి తాటి చెట్ల జాతులు మేడారం అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా కనిపించే చెట్లు ఇవి ఆ తర్వాత ఎక్కువగా కనిపించేవి టేకు చెట్లు. మేడారం అడవులకు ఇవి దట్టమైన అటవీ కవచంలా విస్తరించి ఉంటాయి.

ఆ తర్వాత చెప్పుకోదగ్గవి, నల్లమద్ది మద్ది, నేరేడు, మర్రి, రావి, చెదురు, తుమ్మ, వెలగ చెట్లు కనిపిస్తాయి. ఇవి భూగర్భ జలాలను నిల్వచేసే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల గోదావరి పరివాహక ప్రాంతానికి జీవనాధారంగా నిలుస్తున్నాయని చెప్పవచ్చు. మేడారం అడవులకే ప్రత్యేకతగా చెప్పుకునే ఆయుర్వేద మూలికలు, అక్కడ నివసించే గిరిజనుల సహజ వైద్య పద్ధతులు చాలా ప్రసిద్ధి. మేడారం అడవులు గిరిజన సంప్రదాయ వైద్యానికి జీవకోశం లాంటివి. ఇక్కడి కోయ, లాంబాడా గిరిజనులు తరతరాలుగా మూలికా వైద్యాన్ని పాటిస్తున్నారు. వీరు వైద్యానికి ఉపయోగించే ప్రధాన ఆయుర్వేద మూలికలు, గుగ్గిలం, ఇది కీళ్ల నొప్పులు, వాతం నివారణకు బాగా పనిచేస్తుంది.

రోగనిరోధక శక్తి పెంపుకి మేడారం అడవుల్లోని తిప్పతీగ ప్రసిద్ధి. నెలవెంకగా చెప్పుకునే ఒక మూలిక, ఇది జ్వరాలు, ఇన్‌ఫెక్షన్లు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే బలవర్ధకంగా ఉపయోగపడే అశ్వగంధ ఇక్కడ లభ్యమవుతుంది. మహిళల ఆరోగ్యానికి మేలు చేసే శతావరి మేడారం అడవుల్లో లభిస్తుంది. చర్మ రోగాలు, శ్వాసకోశ సమస్యలు తగ్గించే తులసి, వేప, రక్తశుద్ధికి దివ్యౌషధంగా చెప్పుకునే మోదుగ, డయాబెటిస్ నియంత్రణలో ఉపయోగ పడే అమృతబల్లి…ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో….

మూలికా వైద్యం మేడారం అడవుల్లో నివసించే గిరిజనుల జీవన విధానం. మేడారం అడవుల్లోని గిరిజనులు ఎముక విరుగుడు, చర్మ వ్యాధులు, పాము, తేలు కాట్లు జ్వరాలు, కడుపు నొప్పులు వంటి సమస్యలకు ఆధునిక మందులు లేకుండానే మూలికలతో చికిత్స అందిస్తారు. అయితే, ఈ వైద్య పద్ధతులు అనుభవ జ్ఞానం ఆధారంగా తర తరాలుగా వీరికి వస్తున్న వారస్త్వ సంప్రదాయం. పూర్తిగా శాస్త్రీయమైనవని వైద్యులు నిరధారించకపోవచ్చు. పర్యావరణ పరిరక్షణలో మేడారం అడవుల పాత్ర చాలా ఉంది. కార్బన్ శోషణ ద్వారా వాతావరణ సమతుల్యత కాపాడుతాయి ఈ వనాలు.

అంతే కాక అరుదైన వన్యప్రాణులకు ఆశ్రయం ఇస్తున్నాయి ఈ దట్టమైన అడవులు. ఔషధ మొక్కల సంరక్షణకు సహజ ప్రయోగశాల గిరిజన జీవనాధారానికి మూలస్తంభం. అందుకే మేడారం అడవులను ప్రకృతి ఇచ్చిన ఔషధాల భాండాగారం గా భావించాలి. అయితే, మేడారం జాతరకు వెళ్ళే భక్తులెవరూ ఈ అడవుల్లో అనుమతి లేకుండా మూలికలను సేకరించడం నిషేధం.

వాటిని త్రుంచడం, కొట్టెయ్యడం, ఆకులు, బెరళ్ళు సేకరించడం లాంటి విధ్వంసకర చర్యలకు పూనుకోరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.ఎందుకంటే, అరుదైన ఈ అటవీ సంపదను కాపాడడం అనేది సామూహిక బాధ్యత. మేడారం అంటే భక్తి ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు… అపారమైన వృక్ష సంపద, అద్భుతమైన ఆయుర్వేద వైద్య వారసత్వ సంప్రదాయం, గిరిజన జ్ఞాన సంపద, వీటన్నిటికీ నిలువెత్తు సాక్ష్యం

click here to read more

click here to read medaram 2026 | జాతరతో పాటు చూడాల్సిన పరిసర పర్యాటక ప్రాంతాలు

Leave a Reply