ఇంటి పన్నులు చెల్లించి 5 శాతం రాయితీని పొందండి

ఇంటి పన్నులు చెల్లించి 5 శాతం రాయితీని పొందండి

  • 30 ఏప్రిల్ 2026 వరకు
  • మున్సిపల్ కమిషనర్ ఎస్ అంజయ్య

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం పరిధిలోని గృహ యజమానులు ఇంటి పన్ను చెల్లించి ఐదు శాతం రాయితీ పొందాలని పరకాల మున్సిపల్ కమిషనర్ సోమిడి అంజయ్య తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరపు ఇంటి పన్నులు నేటి నుండి తేది 30.04.2026 లోగా చెల్లించి 5 శాతం రాయితీ (డిస్కౌంట్) పొందాలన్నారు.

ఇంటి పన్నులు వార్డు అధికారి/ బిల్ కలెక్టర్ కు గానీ, ఆన్లైన్లో (హెచ్ టి టి పి ఎస్ ://సి డి ఎం ఏ . సి జి జి. గౌట్ .ఇన్/సి డి ఎం ఏ _ ఏ ఆర్ బి ఎస్ / సి డి ఎం ఏ _పీజీ/ పిటి మెను ) మీ సేవ నందు గానీ, గూగుల్ పే / ఫోన్ పే నందు గానీ లేదా కార్యాలయములో గానీ చెల్లించగలరని, ఈ సదవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని కమిషనర్ అంజయ్య తెలిపారు.

Leave a Reply