అడవి పంది – బైక్ ఢీ

అడవి పంది – బైక్ ఢీ

ముగ్గురికి తీవ్ర గాయాలు

ఉట్నూర్ /జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి జైనూర్ వైపు వస్తున్న ద్విచక్ర వాహనానికి జైనూర్ మండలంలోని జామిని సమీపంలో శనివారం సాయంత్రం అడవిపంది అడ్డంగా రావడంతో ఆ పందికి ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు ఎం. భీమ్‌రావు (26), లక్ష్మణ్ (23), శంకర్ (20)గా గుర్తించారు. వీరు సిర్పూర్ (యు )మండలం రుద్ద కస గ్రామానికి చెందిన వారిని తెలిసింది.

సమాచారం అందుకున్న వెంటనే కెరమెరి 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ షిండే రజినీకాంత్, పైలట్ కొమురయ్య సహాయంతో వారిని జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి వైద్య ఉద్యోగులు వైద్య చికిత్సలు అందించారు.

Leave a Reply