ఎడపల్లి రోడ్డు ప్రమాదం కృష్ణజింక మృతి..
ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండల పరిధిలోని జంలం గేటు సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణజింక మృతి చెందింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు దాటుతున్న జింకను వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ బీట్ అధికారులు సుధీర్, నవీన్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మండల పశువైద్యాధికారి డా. ప్రమోద్ కుమార్ పోస్టుమార్టం నిర్వహించి రోడ్డు ప్రమాదంలోనే జింక మరణించినట్లు నిర్ధారించారు.

అటవీ అధికారులు మాట్లాడుతూ.. NTRSP బ్యాక్‌వాటర్ ప్రాంతంలో కృష్ణజింకల సంచారం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పంట కోతలు పూర్తవడంతో మేత కోసం అవి రోడ్లు దాటుతున్నాయని వివరించారు. మృతి చెందిన జింక తల్లిదని, దాని మూడు పిల్లలు అదే ప్రాంతంలో తిరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. జింకకు అటవీ శాఖ అధికారులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వాహనదారులు ఈ ప్రాంతంలో నెమ్మదిగా, అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
