మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రూ.10,000 జరిమానా

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రూ.10,000 జరిమానా

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : కదిరి మండలం మల్లయ్యగారిపల్లి గ్రామానికి చెందిన బూదిలి నర్సింహారెడ్డి (తండ్రి: సూర్యనారాయణ రెడ్డి) అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసుల తనిఖీలలో పట్టుబడ్డాడు. ఈ రోజు నిర్వహించిన వాహన తనిఖీల సందర్భంగా అతను మద్యం సేవించి వాహనం నడిపినట్లు పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. అనంతరం అతనిని గౌరవ న్యాయమూర్తి (మేజిస్ట్రేట్) ఎదుట హాజరుపరచగా, రూ.10,000 జరిమానా విధించారు.

ఈ సందర్భంగా కదిరి టౌన్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పనిసరిగా రూ.10,000 జరిమానా విధించబడుతుందని తెలిపారు. అదేవిధంగా సంబంధిత వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ప్రక్రియ చేపట్టడంతో పాటు, వాహనాలను మోటారు వాహనాల తనిఖీ అధికారికి (MVI) పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే, రెండోసారి కూడా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే జైలు శిక్షకు కూడా గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Leave a Reply