ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే
ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే
బంటుమిల్లి – ఆంధ్రప్రభ : బంటుమిల్లి మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ నిర్వహించారు. ప్రజల నుంచి పలు సమస్యల పై అర్జీలను స్వీకరించి ముఖ్యంగా గ్రామాల్లో వీధిలైట్లు, నీటి సమస్య, రోడ్ల ఏర్పాటు, భూ ఆక్రమణలు, రెవెన్యూ, విద్యుత్ సమస్యలు, తదితర అంశాలపై పలువురు అర్జీల రూపంలో వినతి చేశారు ప్రజా దర్బారులో ప్రజలు ఇచ్చిన అర్జీలు, ఫిర్యాదు పత్రాలను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పరిశీలించి, పరిష్కరించ గల అర్జీల పై నిర్లక్ష్యం చేయకుండా, శ్రద్ధ వహించాలని సంబంధించిన శాఖ అధికారులకు సూచించడం జరిగింది.
ప్రజా దర్బార్ ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను బాధ్యతతో స్వీకరించి, త్వరితగతిన పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాము. రైతుల భూ సమస్యలపై వచ్చిన అర్జీల పట్ల ఎక్కడ అలసత్వం ప్రదర్శించకుండా, రైతులకు ఇబ్బందులు లేకుండా వి.ఆర్.ఏ., వీఆర్వో స్థాయి నుంచి తహసిల్దార్ వరకు అందరూ వేగవంతంగా పరిష్కరించే జవాబుదారితనంగా ఉండాలని సూచించడం జరిగింది.
