Telangana | యువకుడిని కిడ్నాప్ చేసి..
Telangana | యువకుడిని కిడ్నాప్ చేసి..
Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో జహౌర్ ఇక్బాల్ గ్యాంగ్ రెచ్చిపోయింది. సద్దాం అనే యువకుడిని ఇక్బాల్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లి చితకబాదారు. విచక్షణా రహితంగా కర్రలతో కొట్టడంతో సద్దామ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సద్దాంను ఆస్పత్రికి తరలించారు. సీసీ ఫుటేజ్ లో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 25మంది ఇక్బాల్ గ్యాంగ్ సభ్యులు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
