Masab Tank | కారుతో ఢీకొట్టి…

Masab Tank | కారుతో ఢీకొట్టి…

Masab Tank | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : నగరంలోని మాసబ్ ట్యాంక్ పరిధిలో ఇవాళ తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. న్యాయవాది మొహినుద్దీన్‌పై దుండగులు కారుతో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఇవాళ ఉదయం మొహినుద్దీన్ తన ఇంటి నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు కారుతో ఢీకొట్టిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply