సింగారపేని గుట్ట మట్టి దందా బీభత్సం…

సింగారపేని గుట్ట మట్టి దందా బీభత్సం…

  • ఇప్పగూడెం గ్రామ రోడ్లు చిత్తు!
  • అక్రమ తవ్వకాలతో గ్రామంలో అల్లకల్లోలం
  • టిప్పర్ల రాకపోకలతో భయభ్రాంతులు గురవుతున్న ప్రజలు
  • మిషన్ భగీరథ పైపులైన్లకు భారీ నష్టం
  • అనుమతుల్లేకుండా కొనసాగుతున్న మట్టి తరలింపులు
  • పర్యావరణానికి ముప్పు…వన్యప్రాణుల నివాసాలు నాశనం
  • గుట్ట తవ్వకాలు శాశ్వతంగా నిలిపివేయాలని గ్రామస్తుల డిమాండ్
  • సర్పంచ్ కు వినతి పత్రం అందించిన పలువురు యువత, గ్రామస్తులు

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలోని సింగారపేని గుట్ట వద్ద మట్టి తరలింపుల దందా తీవ్ర స్థాయికి చేరి గ్రామ రహదారులు పూర్తిగా నాశనం అవుతున్నాయని గ్రామస్తులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గుట్ట నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తూ కుర్చపల్లి రహదారులతో పాటు ఇప్పగూడెం గ్రామంలోని సీసీ రోడ్లు టిప్పర్ల రాకపోకలతో తీవ్రంగా దెబ్బతింటున్నాయని వారు తెలిపారు.

భారీ లోడ్లతో రాత్రి వేళల్లో వేగంగా దూసుకెళ్తున్న టిప్పర్ వాహనాల కారణం గా గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు. రోడ్లు మాత్రమే కాకుండా మిషన్ భగీరథ పైపులైన్లు, ఇతర ప్రజా ఆస్తులకు కూడా నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. ఈ పరిస్థితిని అడ్డుకునేం దుకు గ్రామ యువత ఇటీవల కాలంలో స్కూల్ సమీపంలో టిప్పర్లను నిలిపివేయగా కొంతకాలం పరిస్థితి నియంత్రణలోకి వచ్చినప్పటికీ మళ్లీ మట్టి తరలింపులు పునఃప్రారంభమయ్యాయని తెలిపారు.

గుట్ట తవ్వ కాలకు సరైన అనుమతులు లేకపోయినా యథే చ్ఛగా మట్టి తరలిం పులు కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. గుట్టలు విధ్వంసం కావడం తో నెమళ్లు, కోతులు వంటి వన్య ప్రాణులు తమ నివాసాలను కోల్పో తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వర్షపాతం తగ్గే ప్రమాదం కూడా ఉందని సూచించారు. వెంటనే గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలి.

గ్రామ కమిటీ ఏర్పా టు చేసి గుట్ట తవ్వకాలపై తీర్మానం చేసి సంబంధిత అధికారులకు పంపించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సంబంధిత శాఖలకు లిఖితపూర్వక ఫిర్యాదులు చేసి గుట్ట తవ్వకాలను పూర్తిగా నిలిపి వేయాలని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఇప్పగూడెం గ్రామానికి చెందిన అన్ని పార్టీల నాయకులు రాజకీయాలకతీతంగా స్పందించి సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని ప్రజలు కోరుతున్నారు. మైనింగ్ అధికారులతో కుమ్మక్కై జరుగుతున్న ఈ విధ్వంసాన్ని అడ్డుకోవాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

సర్పంచ్ కు పలువురు గ్రామస్తుల వినతి:

సింగారపేని గుట్ట నుంచి మోరం తవ్వకాలకు గ్రామపంచాయతీ నుంచి ఏమైనా అనుమతులు ఇచ్చారా? ఇచ్చి ఉంటే ఏ చట్ట ప్రకారం ఇచ్చారో వివరించాలని సర్పంచ్ కు రెండు రోజుల క్రితం వినతి రూపంలో పలు వురు గ్రామస్తులు కోరారు. భారీ వాహనాల రాకపోకల వల్ల గ్రామ ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు, పైపులైన్లు, వ్యక్తిగత ఆస్తు లు దెబ్బతింటున్నాయని తెలిపారు.

ఇప్పటికే జరిగిన నష్టాన్ని గుట్ట యజమానులు తమ సొంత ఖర్చులతో పునర్నిర్మించాలి. భవిష్యత్తులో ఇలాంటి తవ్వకాలు పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామ భవిష్యత్ తరాల సంక్షేమం దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలు ఏకమై ఈ సమస్యపై పోరాటం కొనసాగిస్తా మని హెచ్చరించారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే తదుపరి జరిగే పరి ణామాలకు సంబంధిత అధికారులు, బాధ్యులే పూర్తి బాధ్యత వహిం చాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

-ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తా: ఇప్పగూడెం సర్పంచ్ మందపురం రాణి అనిల్

గ్రామంలో జరుగుతున్న మట్టి తరలింపుల సమస్యపై సర్పంచ్ ను వివరణ కోరగా..నూతనంగా ఏర్పడిన మా పాలక వర్గం జీపీ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఈ సమస్య మా దృష్టికి వచ్చింది. మిషన్ భగీరథ పైపు లైన్లు, సీసీ రోడ్లు, చిన్నపిల్లల భద్రత ఇవన్నీ దృష్టి లో ఉంచుకుని వెంటనే చర్యలు చేపడుతాం. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. గ్రామంలోకి టిప్పర్లు రాకుండా అవసరమైతే అడ్డంకులు ఏర్పాటు చేస్తాం. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తాను. గ్రామ ప్రజలు ఆందోళన చెందా ల్సిన అవసరం లేదు. గ్రామాభివృద్ధి, ప్రజల భద్రతే నా లక్ష్యమని తెలి పారు.

Leave a Reply