Renuka Chowdhury |ఇది అమరావతి రైతుల విజయం

Renuka Chowdhury |ఇది అమరావతి రైతుల విజయం

MP Renuka Chowdhury | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా విభజన హామీల అమలుపై కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించే బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చించేందుకు రాజ్యసభ ఛైర్మన్ రెండు గంటల సమయం కేటాయించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ… ఇది అమరావతి రైతుల విజయమన్నారు. ఎంత వేధించినా రైతులు నిరసన ఆపలేదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అమరావతికి మా మద్దతు ఉంటుందన్నారు. హామీలు అమలు చేయనందుకు తగిన పరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు గడిచినా ఆస్తుల పంపకం పూర్తికాలేదని విమర్శించారు. ఈ అంశాలపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని ఆమె కోరారు. బిల్లుపై చర్చ కొనసాగుతుండగా, సభ్యుల అభిప్రాయాల అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Leave a Reply