Investigations | బొగ్గు స్మగ్లింగ్ కేసులో….
Investigations | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. పలు నగరాల్లో ఒకేసారి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
రాజకీయ వ్యూహాల సంస్థగా గుర్తింపు పొందిన ఐప్యాక్ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తూ ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ నగరాల్లో ఉన్న ఐప్యాక్ కార్యాలయాల్లో ఈడీ బృందాలు ఒకేసారి దాడులు నిర్వహిస్తున్నాయి. పత్రాలు, డేటా, లావాదేవీల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
