పాణ్యం సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ…

పాణ్యం సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ…
డాక్యుమెంటరీ దుకాణాలను సీజ్ చేయాలని ఆదేశించిన కలెక్టర్…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో ఇటీవల కాలంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల సోదాలు జిల్లాలో కలకలం సృష్టించాయి. ప్రజలను చూస్తున్న ఫిర్యాదుల మేరకు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా బుధవారం జిల్లాలోని పాణ్యం సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లు రికార్డులను పరిశీలించారు. కార్యాలయంలో అందిస్తున్న సేవలు, సౌకర్యాలు ఎంత సమయంలో అందిస్తున్నారో, ప్రజల సంతృప్తి స్థాయి ఎలా వుందో సంబంధిత అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్న రు.
ఈ ఏడాది మార్చి వరకు ఎన్ని రిజిస్ట్రేషన్ లేని ప్రజలు అధికారులకు అందుబాటులో ఉన్నారా లేరా అని ప్రశ్నించారు. హాజరు పట్టిని తనిఖీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలోని డాక్యుమెంట్ రైటర్లు జిల్లా కలెక్టర్ ని చూసి తమ దుకాణాలను వదిలి వెళ్లిపోవడంజరిగింది. ఎందుకు దుకాణాలను మూసివేస్తున్నారని ప్రశ్నించారు. దీనిని చూసిన జిల్లా కలెక్టర్ సంబంధిత దుకాణాలను సీజ్ చేయించాలని ఆదేశించరు. కార్యక్రమంలో సబ్ రిజిస్టర్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
