Allagadda| లారీ ని ఢీకొన్న బస్సు – క్లీనర్ మృతి
నంద్యాల బ్యూరో – ఆంధ్రప్రభ ….. కర్నూల్ చిత్తూర్ జాతీయ రహదారిపై నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శివార్లలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు క్లీనర్ మురారి యాకేష్ ( 31 ) మృతి చెందాడు..
ఆళ్లగడ్డ పోలీసులు తెలిపిన వివరాల మేరకు కడప నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. . ఈ ప్రమాదంలో క్లీనర్ మరణించాడు .ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.