Union Minister | అమరావతి బిడ్డగా సభలో ప్రసంగించడం అదృష్టం

Union Minister | అమరావతి బిడ్డగా సభలో ప్రసంగించడం అదృష్టం
Union Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టసవరణతో రాజధానిపై ఉన్న అనుమానాలకు ముగింపు పలుకుతుందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆయన స్పష్టం చేశారు. గతంలో వికేంద్రీకరణ పేరుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారని విమర్శించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి శాశ్వతంగా కొనసాగుతుందా అన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని, ఈ చట్టసవరణతో ఆ సందేహాలకు పూర్తిగా తెరపడుతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
