ఈ కోర్సు కేవలం డిగ్రీ కాదు.. పరిశోధన వేదిక కోర్స్…

ఈ కోర్సు కేవలం డిగ్రీ కాదు.. పరిశోధన వేదిక కోర్స్…

ఐఐఎస్‌ఈఆర్ ప్రవేశాల సమయానికి వేళా యే..
5 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ కోర్స్…
ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువ…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సమయం ముగిసిపోయింది. పరీక్ష పేపర్లు దిద్దే కార్యక్రమం కొనసాగుతుంది. ఫలితాలు ఈనెల 17వ తేదీన విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కృషి చేస్తున్నారు. ఫలితాలు వచ్చే సమయంలోపల ఇంటర్మీడియట్ చదివిన ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులు ఉన్నత విద్య కోసం వివిధ రకాలుగా అన్వేషణ కొనసాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ యుగములో బిఏ బీకాం బీఎస్సీ కోర్సులతోపాటు బీటెక్, బీసీఈ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ వంటి ఇంజనీరింగ్ కోర్సులు తో పాటు ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుర్వేదం యునాని, బి ఫార్మసీ ఎం ఫార్మసీ నర్సింగ్ వంటి వైద్య కోర్సుల్లో చేరటానికి తల్లిదండ్రులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం విశేషం.

అయితే ఇటీవల కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశోధనా రంగం వైపు శాస్త్రవేత్తలుగా అభివృద్ధి సాధించాలన్న ధ్యేయం విద్యార్థుల్లోనూ వారి తల్లిదండ్రులను కనిపిస్తుంది. ఇలాంటి వారి కోసం ఇంటర్మీడియట్ తర్వాత రీసెర్చ్ మరియు సాంకేతిక రంగంలో స్థిరపడాలని వారికి ఇదొక నూతన కోర్స్ అందుబాటులోకి రావటం రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కృషితో సాధ్యమైంది.ఐ ఐ ఎస్ ఈ ఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థల్లో ఐదు సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ కోర్స్ ప్రవేశాల గురించి నోటిఫికేషన్లు విడుదల చేసింది.ఇంటర్మీడియట్ తర్వాత సైన్స్ మరియు రీసెర్చ్ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా ప్రభుత్వము పేర్కొంటుంది. భారత ప్రభుత్వము లోని విద్యాశాఖకు చెందిన ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐ ఐ స ఈ ఆర్ సంస్థల్లో 2026 విద్యా సంవత్సరానికి గాను 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బి ఎస్, మరియు ఎం ఎస్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

​5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ బి.ఎస్ – ఎం.ఎస్ మరియు కొన్ని చోట్ల 4 ఏళ్ల బి.ఎస్ కోర్స్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శాస్త్ర పరిశోధన రీసెర్చ్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో కెరీర్ నిర్మించుకోవడానికి ఇది ఒక గోల్డెన్ అవకాశంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపయోగించుకోవచ్చు. ఈ కోర్సుల్లో చేరటానికి అర్హతలు ప్రభుత్వము నిర్ణయించింది. ఇంటర్మీడియట్ 10+2 సైన్స్ స్ట్రీమ్ లో చదివిన విద్యార్థులు 2024 మరియు 2025లో ఉత్తీర్ణులైన వారు లేదా 2026లో ఫైనల్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరటానికి అర్హులు. ఇంటర్మీడియట్ కోర్సులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మరియు బయాలజీలలో కనీసం మూడు సబ్జెక్టులు చదివి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్న రు. ఈ కోర్సుల్లో చేరటానికి ​కనీస
మార్కులు జనరల్,ఓబీసీ, ఈ డబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60 శాతం మార్కులు, ఎస్సీ ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 55 మార్కులు వచ్చి ఉండాలని సూచించారు. ఈ కోర్సుల్లో చేరటానికి ఏప్రిల్ 13వ తేదీలోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.మే 24 వ తేది న దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు
​హాల్ టికెట్ల విడుదల చేయనున్నారు. ఈ ఏడాది జూన్ 7 తేదీన పరీక్ష నిర్వహిస్తున్నారు.

​ప్రవేశాలు కేవలం ఐ ఐ ఎస్ ఈ ఆర్ అపటిట్యూడ్ టెస్ట్ ద్వారానే నిర్వహిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ​పరీక్షా విధానంకం పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష గా ఉంటుంది . మొత్తం 60 ప్రశ్నలు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ బయాలజీ సబ్జెక్టుల నుండి ఉంటాయి. ఈ పరీక్ష విధానంలో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.ప్రతి సరైన సమాధానానికి +4, తప్పు సమాధానానికి -1 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ విషయాన్ని విద్యార్థులు తెలుసుకోవాలి. ఈ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు కోసం దరఖాస్తు రుసుము జనరల్, ఓబీసీ, ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు రు 2వేలు, ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యుడి,కాశ్మీరీ మైగ్రెంట్స్ విద్యార్థులకు ₹1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఐఐఎస్‌ఈఆర్ క్యాంపస్‌లు…

దేశవ్యాప్తంగా మొత్తం 7 క్యాంపస్‌లు ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లోను, ఒడిస్సా లోని ,బెర్హంపూర్, మధ్యప్రదేశ్ లోని
​భోపాల్, పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతా, పంజాబ్ లో ​మొహాలీ, మహారాష్ట్ర లోని పూణే, కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం లో క్యాంపస్ కోర్సులు ఉన్నాయన్న రు.

ఎలా దరఖాస్తు చేయాలి?

​అర్హత కలిగిన విద్యార్థులు www.iiseradmission.in అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు.

భవిష్యత్తు ఎలా ఉంటుంది…?

ఐఐఎస్‌ఈఆర్ ఉజ్వల భవిష్యత్తు ​ఉన్నత చదువులు భవిష్యత్తుకు మంచి క్యారియర్ కు ఉపయోగపడతాయి. ఈ కోర్సుల్లో విజయం సాధించిన వారు 60నుంచి 70 శాతం విద్యార్థులు అమెరికా, యూరప్ వంటి దేశాల్లోని టాప్ యూనివర్సిటీలలో నేరుగా పీహెచ్‌డీ చేసే అవకాశం పొందుతారు.వీరికి నెలకు 40 వెల రూపాయలు పైగా స్టైపెండ్‌తో అవకాశం లభిస్తుంది. ఈ కోర్సులు ఉత్తీర్ణత సాధించిన వారు భవిష్యత్తులో శాస్త్రవేత్తగా కెరీర్ గా ఇస్రో ఐ ఎస్ ఆర్ ఓ,డిఆర్‌డిఓ బార్క్,వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థల్లో శాస్త్రవేత్తలుగా స్థిరపడవచ్చు.

కార్పొరేట్ ఉద్యోగాలకు అవకాశం…

ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఫార్మా, బయోటెక్నాలజీ మరియు డేటా సైన్స్ రంగాల్లోని టాప్ కంపెనీలలో ఏడాదికి రూ. 7 నుండి 15 లక్షల రూపాయలు ప్రారంభ ప్యాకేజీతో ఉద్యోగాలు లభిస్తాయి. బోధన మరియు సివిల్స్ కు ఐఐటీలు, యూనివర్సిటీలలో ప్రొఫెసర్లుగా లేదా సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ , ఐపీఏస్ వంటి ఉన్నత ఉద్యోగాలకు కూడా వీరు అర్హులుగా అవకాశాలుంటాయి. ఇది కేవలం డిగ్రీ మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే ఒక అద్భుతమైన పరిశోధనా వేదిక ఈ కోర్సులు చేరటానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.