NTR | షాక్ ఇచ్చిన స్టార్ విలన్.
NTR | షాక్ ఇచ్చిన స్టార్ విలన్.
NTR | పవర్ ఫుల్ రోల్ లో ఎన్టీఆర్
టొవినో థామస్ ఎందుకు నో చెప్పాడు?
NTR | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందుతోన్న మూవీ డ్రాగన్. ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ తన స్టైల్ మార్చి సినిమా చేస్తున్నారు. వార్ 2 మూవీ డిజాస్టర్ అవ్వడంతో.. డ్రాగన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ (NTR Fans) ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ మూవీలో నటించే ఛాన్స్ వస్తే.. స్టార్ విలన్ నో చెప్పాడట. ఇంతకీ.. ఆ స్టార్ ఎవరు..? ఎందుకు నో చెప్పాడు..?
NTR | పవర్ ఫుల్ రోల్ లో ఎన్టీఆర్..
ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ప్రశాంత్ నీల్ చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నారు. హీరో పవర్ ఫుల్ గా ఉంటే.. విలన్ అంతకు మించి అనేట్టుగా పవర్ ఫుల్ గా చూపించాలి. అందుకనే.. ఈసారి కొత్త విలన్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలి అనుకున్నారు నీల్. మలయాళ స్టార్ టొవినో థామస్ తో విలన్ రోల్ చేయించాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు.. టొవినో థామస్ కి చెబితే.. ఓకే చెప్పారని టాలీవుడ్, మాలీవుడ్ (Mollywood) లో వార్తలు వచ్చాయి. కొన్ని వారాల క్రితం ఈ సినిమాలోని పాత్ర కోసం కఠినమైన శిక్షణ తీసుకుంటున్న వీడియోని అతను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నెగటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, పుష్పలో ఫహద్ ఫాసిల్ కు పదింతల ఇంటెన్సిటీ ఉండేలా డిజైన్ చేశారని ప్రచారం జరిగింది.

NTR | అందుకే నో చెప్పాడా..
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా నుంచి టొవినో థామస్ తప్పుకున్నాడు. ఇదేదో గాసిప్ అనుకుంటే.. పొరపాటే. ఇది నిజంగా నిజం. ఈ విషయాన్ని స్వయంగా టొవినో థామస్ చెప్పాడు. ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న పళ్ళిచట్టంబి ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ (Hyderabad) వచ్చిన అతను ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ విషయం బయటపెట్టాడు. ఎందుకు ఈ సినిమాకి నో చెప్పాడంటే.. వేరే కమిట్ మెంట్స్ వల్ల నీల్ సినిమాకు డేట్స్ కేటాయించడం కష్టంగా ఉందని.. అందుకే ఈ సినిమాకి నో చెప్పాల్సి వచ్చిందని చెప్పాడు. అయితే.. టొవినో థామస్ స్థానంలో ఎవర్ని తీసుకున్నారు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

