సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని ఒడితల రైతు వేదికలో మంగళవారం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫామింగ్(సేంద్రియ వ్యవసాయం)లో భాగంగా ఏవో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఏ ఈ ఓ రరమణకుమార్, ఎన్జీవో జిల్లా నోడల్ ఆఫీసర్ మణికుమార్, ఒడితల, కొత్తపేట,లక్ష్మిపూర్ తండ, సర్పంచ్లు , ఉప సర్పంచ్లు పాల్గొన్నారు.
అనంతరం రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. అనంతరం ఏవో మాట్లాడుతూ.. రైతులకు కృషి సఖిలకు ప్రకృతి వ్యవసాయంపై ట్రైనింగ్ , అధిక పురుగుమందుల వాడకం వలన కలిగే నష్టాల వివరిస్తూ రైతులు ఫర్టిలైజర్, పురుగుమందుల విచ్చలవిడి వాడకాన్ని తగ్గించి ,ప్రకృతి వ్యవసాయం వైపు మల్లాలని, అవగాహన కల్పించారు. జీవామృతం, నీమాస్త్రం, అగ్న్యాస్త్రం వంటి పలు రకాల సేంద్రియ పదార్థాల తయారీ విధానాలను రైతులకు వివరించారు. రైతులకు ఎం ఎన్ ఎఫ్ కిట్ (ఒక కర పుస్తకం, టోపీ, నోట్ పాడ్, పెన్,ఐడి కార్డు, క్యాలెండరు,జ్యూట్ బ్యాగ్) లను అందజేశారు .
