పార్టీ పురోభవృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
పార్టీ పురోభవృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
పశ్చిమ నియోజకవర్గ టిడిపి శ్రేణులతో రాష్ట్ర నాయకత్వం జూమ్ మీటింగ్
పార్టీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని పలువురు సీనియర్ నాయకులకు ఘన సన్మానం
విజయవాడ, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ మరింత పురోభవృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని , పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి నడుచుకోవాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిడిపి శ్రేణులతో గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జూమ్ మీటింగ్ ఆదివారం జరిగింది. ఈ జూమ్ మీటింగ్లో రాష్ట్రస్థాయి పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధికి, టిడిపి కూటమి ప్రభుత్వ పథకాలలో ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే దానిపై దిశా నిర్దేశం చేశారు.
పార్టీ 44 వసంతాల వేడుకలలో పురస్కరించుకొని గ్రామ, వార్డు క్షేత్రస్థాయిలో టిడిపి మరింత బలోపేతంకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఆయా సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను, యువ నాయకులు నారా లోకేష్ ప్రసంగాన్ని ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ నాయకులు జూమ్ యాప్ ద్వారా వీక్షించారు.

పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకులు నారా లోకేష్ తదితరుల సందేశాలను నాయకులు సమావేశంలో విన్నారు. ఈ సమావేశంలో కృష్ణాజిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎమ్ ఎస్ బేగ్, టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతాఉల్లా, రాష్ట్ర నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ సుకాసి కిరణ్ కుమార్, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి రేగళ్ల లక్ష్మణరావు, గొల్లపూడి మార్కెట్ యార్డ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పాల మాధవ, దుర్గగుడి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు సుకాసి సరిత, నియోజకవర్గం లోని వివిధ డివిజన్ల అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీను, కుంచెం దుర్గారావు, జహీద్, కొండ, శివశర్మ, క్లస్టర్ ఇన్చార్జిలు కరీముల్లా, గణేష్, హనుమంతరావు, నియోజకవర్గ మైనార్టీ సెల్ నాయకులు ఆన్సర్, అలీ, తెలుగు యువత నాయకులు ఆర్ మాధవ, భవాని, మహిళా విభాగం అధ్యక్షురాలు నసీమా, నాయకులు భార్గవి, మల్లేశ్వరి, దుర్గ, ఐటీడీపీ నాయకులు చైతన్య, దుర్గ, ప్రియా తదితరులు పాల్గొన్నారు.

.సీనియర్ పార్టీ నాయకులకు ఘన సన్మానం..
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ, కష్ట సుఖాలలోను పార్టీకి అండగా ఉన్న నాయకులను ఎంపీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. పార్టీ 53,54 డివిజన్ల క్లస్టర్ ఇంచార్జి కరీముల్లా, 39 వ డివిజన్ అధ్యక్షుడు కే శివశర్మ లను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించి పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు.

కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎమ్ ఎస్ బేగ్, పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా , మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ పాల మాధవ తదితరులు శివశర్మ, కరీముల్లా కు జరిగిన ఘన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
