ఘనంగా సీతారాముల కల్యాణం..

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; శ్రీరామ నవమి వేడుకలను ప్రజలు శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని రామాలయంలో సీతారాముల కల్యాణం వైభవోపేతంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఆనంతరం అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని తదితర గ్రామాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్,ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ పార్టీల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.