యువజన కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు నాయకత్వం….
యువజన కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు నాయకత్వం….
- ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ…
బిక్కనూర్, ఆంధ్రప్రభ ; యువజన కాంగ్రెస్ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ చెప్పారు. సోమవారంభిక్కనూరు పట్టణంలోని ఎస్.వి గార్డెన్‌లో భిక్కనూరు మండల యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు హాజరై యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు , పట్టణ అధ్యక్షులకు నియామక పత్రాలను షబ్బీర్ అలీ గారి చేతుల మీద, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఇలియాస్ , జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ అందజేశారు. అనంతరంప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూయువజన కాంగ్రెస్ అనేది కేవలం ఒక రాజకీయ విభాగం మాత్రమే కాదని, భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేసే పాఠశాల అని పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్నో గొప్ప నాయకులు యువజన కాంగ్రెస్ నుంచే ఎదిగారని గుర్తు చేశారు.
తాను యువజన కాంగ్రెస్‌లో పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ, ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామని తెలిపారు. అసెంబ్లీలోకి చొచ్చుకెళ్లిన ఉద్యమంలో పాల్గొన్నందుకు నెలరోజుల పాటు జైలుశిక్ష అనుభవించానని, కానీ ప్రజల కోసం చేసిన ఆ పోరాటమే తన రాజకీయ జీవితానికి బలమైందని చెప్పారు. కేవలం 30 సంవత్సరాల వయసులోనే మంత్రి అయ్యానంటే దానికి కారణం యువజన కాంగ్రెస్‌లో చేసిన పోరాటాలేనని వివరించారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా యువజన కాంగ్రెస్ నాయకుల పోరాటాలను గుర్తు చేసుకుంటున్నారని, పోరాట స్ఫూర్తి ఉన్న వారికే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అన్నారు.
యువత ఎప్పుడూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రతిపక్షాల అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలపై ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే యువత పాత్ర అత్యంత కీలకమని, ప్రతి గ్రామంలో యువజన కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు. యువత ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయాలని అన్నారు. కష్టపడి పనిచేసే వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గుర్తింపు ఇస్తుందని, భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు కూడా కల్పిస్తుందని తెలిపారు.
రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఇలియాస్ మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసి ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ మాట్లాడుతూ
నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో యువజన కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేసి యువతను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఉమారాణి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్, నాయకులు గుడుగుల శ్రీనివాస్,ఎడ్ల రాజిరెడ్డి, భీమ్ రెడ్డి, అనంతరెడ్డి, సుతారి రమేష్ , మహేందర్ రెడ్డి, తిరుమల గౌడ్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, యాదవ రెడ్డి, పట్టణ మండల అధ్యక్షులు,ఐరేని సందీప్ , శ్రీనివాస్ , రాజ గౌడ్ , నరేందర్ రెడ్డి, పాత రాజు, అంకం కృష్ణారావు, డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్ , రాజ బాబు గౌడ్, విజయ్, నూతనంగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్, అజ్మత్, మహేష్, హనుమాన్ల రామ్ కుమార్, ప్రభాకర్ గౌడ్, నాగేంద్ర వర్మ, సమరసింహారెడ్డి, రాజారెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వివిధ మండలాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
