ఏడాది పెండింగ్ వేతనాలు చెల్లించాలి..

ఏడాది పెండింగ్ వేతనాలు చెల్లించాలి..
-తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి సాయి రెడ్డి
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ: గత 25 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల్లో కేవలం రూ. 5200 స్వల్ప వేతనంతో కాంటిజెంట్ వర్కర్లు గా పనిచేస్తున్న కార్మికులకు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ హెచ్1 యూనియ న్ రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి సాయి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ బేగంపేట్‌లోని మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో అధికారులకు ఆయన ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం వినతి పత్రం అందజేసింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తాళాలు తీసి శుభ్రం చేయడం మొదలుకొని, ఉద్యోగులు ఇంటికి వెళ్లే వరకు అన్ని పనులు నిర్వర్తిస్తు న్నప్పటికీ కాంటిజెంట్ వర్కర్లకు గత ఏడాది నుంచి వేతనాలు అందడం లేదని అన్నారు. కంటిన్యూషన్ ఆర్డర్ వస్తేనే వేతనాలు చెల్లించగలమని అధికారులు చెప్పుతున్నారని తెలిపారు. ఏడాది కాలంగా జీతాలు రాక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని పలువురు వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న వేతన ఫైల్‌ను తక్షణం పరిష్కరించి, కంటిన్యూషన్ ఆర్డర్ జారీ చేసి, బకాయి జీతాల ను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, హరి ప్రసాద్, మల్ల య్య, శ్రీనివాస్, సతీష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
