మున్సిపాలిటీ ప్రజలకు మేము అండగా ఉంటాము
మున్సిపాలిటీ ప్రజలకు మేము అండగా ఉంటాము
- మున్సిపల్ చైర్ పర్సన్ , వైస్ చైర్ పర్సన్
కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మున్సిపాలిటీ ప్రజలు అధైర్య పడవద్దని, ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకుని రావాలని, ఎల్లప్పుడూ మేము అండగా ఉంటామనీ మున్సిపల్ చైర్ పర్సన్ భానోత్ సునీత, వైస్ చైర్ పర్సన్ అల్లం రామాలు వార్డు ప్రజలకు భరోసా ఇచ్చారు. శనివారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగంగా కేసముద్రం మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్డ్ సభకు మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న, వైస్ చైర్ పర్సన్ అల్లం రామ నాగేశ్వర్ రావులు ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంట మార్పిడి చేద్దాం- భూసారాన్ని కాపాడుదాం అని రైతు సోదరులకు సూచన ఇచ్చారు. అదేవిధంగా మహిళల భద్రత, కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది అని అన్నారు. వార్డులో డ్రైనేజ్, సానిటేషన్, సైడ్ డ్రెయిన్ ల పూడిక తీత సమస్యలు ఉంటే వెంటనే అధికారులకు మీ వార్డ్ కౌన్సిలర్లకు చెప్పి చేయించుకోవాలని సూచించారు. వచ్చేది వర్షాకాలం కాబట్టి నీటిని నిలువ లేకుండా శుభ్రం చేసుకోవాలని ప్రజలకు తెలిపారు. వార్డ్ లో లైట్, రోడ్, సమస్యలు ఉంటే సంబంధించిన అధికారులకు లేదా మా దృష్టికి తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టీ. శ్రీనివాస్ రావు, వార్డ్ కౌన్సిలర్స్ తరాల వీరేష్ యాదవ్, దరావత్ కిషోర్, వేముల భారతి, కనుకుల సుభద్ర, భానోత్ విజయ, వళ్ళందాసు ఉమా, రావుల వినయ్ రెడ్డి, ఆగే రాము, దుడేపాక కృష్ణ, జాటోత్సు నీత, మేకల శారద , విద్యాశాఖ అధికారులు, వ్యవసాయ శాఖ, వైద్య శాఖ , పోలీస్ శాఖ, పట్టణభివృద్ధి శాఖ, రెవిన్యూ శాఖ స్త్రీ , శిశు సంక్షేమ శాఖ, స్వయం సహాయక సంఘాలు , అన్ని శాఖ సంబంధిత అధికారులు, అంగన్వాడీ టీచర్, ఆశ వర్కర్స్, మున్సిపాలిటీ ఆర్పీలు, మహిళలు , రైతులు తదితరులు పాల్గొన్నారు.
