జడ్చర్లలో సీఎం రేవంత్ రెడ్డి సభకు ముమ్మర ఏర్పాట్లు..

మహబూబ్ నగర్, జడ్చర్ల, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఈ నెల 5న నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జడ్చర్ల నుంచి గంగాపూర్‌కు వెళ్లే మార్గంలో ఏర్పాటు చేయనున్న సభా స్థలాన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా సభ నిర్వహణకు సంబంధించిన భద్రతా చర్యలు, రవాణా సౌకర్యాలు, ప్రజలకు అందించాల్సిన మౌలిక వసతులు, తాగునీటి ఏర్పాట్లు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు వారు సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా,ఎస్పీ డి.జానకి తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఎం సభను విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply