వడదెబ్బతో మహిళ మృతి..
గూడూరు రూరల్, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన కొట్టెం భద్రమ్మ (60) వడదెబ్బతో మృతి చెందారు. గురువారం భద్రమ్మ మిర్చి తోటలో కూలి పనికి వెళ్లగా తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బకు గురై అస్వస్థతకు లోనయ్యారు. దీంతో గ్రామస్తులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వడదెబ్బతో మృతి చెందిన భద్రమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ కోరారు.
