సీనియర్ న్యాయవాది అకాల మరణం…

సీనియర్ న్యాయవాది అకాల మరణం…

కాపు నాయకుడి మృతి బాధాకరం : దేవినేని అవినాష్
భౌతిక కాయానికి నివాళి అర్పించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు అవినాష్
కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం

విజయవాడ, ఆంధ్రప్రభ : సీనియర్ న్యాయవాది, కాపు నాయకులు నరహరశెట్టి శ్రీహరి అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. శ్రీహరి మరణం న్యాయవృత్తికి, సామాజిక వర్గానికి తీరని లోటని అవినాష్ పేర్కొన్నారు.

అనంతరం శ్రీహరి సోదరుడు నర్సింహారావు ను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ దుఃఖ సమయంలో కుటుంబానికి ధైర్యం కలగాలని, మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Leave a Reply